సికింద్రాబాద్ నవంబర్ 14,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిదేవాలయంలోఅన్నకోటిమహోత్సవంలో మాజీ మంత్రి, బీ జే పీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని *శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే అన్నకోటి మహోత్సవాన్ని పురస్కరించుకుని, శనివారం మధ్యాహ్నం ఈ మహోత్సవంలో మర్రి పాల్గొన్నారు.ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు దివ్య ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం దేవాలయ కమిటీ ప్రతినిధులు గుమిడెల్లి శ్రీనివాస్, గుమిడెల్లి రవీందర్ లు మర్రిని ఘనంగా సన్మానించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇతర భక్తులతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, బీజేపీ మహంకాళి జిల్లా పదాధికారులు సి.కె. నర్సింగ్ రావు, వజనాల దయానంద్ రావు, ఆకుల రమేష్ కుమార్, పట్టెం కిరణ్, ఆకుల విజయ్, సింగంశెట్టి మనోహర్, మోండా మార్కెట్ డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, జీతు, జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ సి.ఎన్. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: