హైదరాబాద్ నవంబర్ 14(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
ప్రముఖ సినీనటుడు గిరిబాబు(80) కొంతకాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలుగా చిత్ర రంగంలో రాణించిన ప్రముఖ నటుడు గిరిబాబు 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు.ఆయన 600కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గిరిబాబు కుమారుడు రఘుబాబు హాస్యనటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు
సుపరిచితులు. గిరిబాబు నటుడుగా, చిత్ర నిర్మాతగా, దర్శకుడుగా పలు చిత్రాలు నిర్మించారు.ప్రతి సంక్రాంతి కి ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి రావి నూతలలో గడుపుతుంటారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: