డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు.కిషన్ రెడ్డి తో కలిసి నషా ముక్త్ భారత్ యాత్ర’ టీ-షర్టులను ఆవిష్కరించిన చిరంజీవి.

హైదరాబాద్ నవంబర్ 14 (జె ఎస్ డి ఎం న్యూస్ )
యువత భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన మద్దతును ప్రకటించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ నేపథ్యంలో, ఈ మహా యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా చిరంజీవిని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.​ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ సమాజాన్ని,ముఖ్యంగా యువత
భవిష్యత్తును నాశనం చేస్తున్న
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తాము సైతం చేయూతను అందిస్తామని స్పష్టం చేశారు.​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *