ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి…..

హైదరాబాద్ నవంబర్ 14,( జేఎస్ డి ఎం న్యూస్ ) :
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ట్రాఫిక్ పోలీసులు కోరారు.బాలల దినోత్సవంసందర్భంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ ట్రాఫిక్ జోన్ పరిధిలోని విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్ల పంపిణీ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్, ఆదేశాల మేరకు, ఖైరతాబాద్ ట్రాఫిక్ జోన్ పరిధిలోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు మరియు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మక రహదారి భద్రతా ప్రచార కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’ లో భాగంగా, ట్రాఫిక్ డీసీపీ-1 అవినాష్ కుమార్, మరియు ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎస్. మోహన్ కుమార్ పర్యవేక్షణలో
ఈకార్యక్రమాలను చేపట్టారు.సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సైదిరెడ్డి పర్యవేక్షణలో
లియో పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అనంతరం హెల్మెట్లను పంపిణీ చేశారు.పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.వి. రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో అన్సారీ మంజిల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలు మరియు పాదచారుల భద్రతపై అవగాహన కల్పించి, హెల్మెట్లను అందజేశారు.అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్. మధుసూదన్ పర్యవేక్షణలో జీపీఓ సర్కిల్ వద్ద విద్యార్థులకు ట్రాఫిక్ నియంత్రణ మరియు నిబంధనలపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించి, హెల్మెట్లను పంపిణీ చేశారు.సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సిద్ధార్థ్ నాయక్ పర్యవేక్షణలో కేశవ్ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు సురక్షిత ప్రయాణం మరియు హెల్మెట్ ధరించడం యొక్క ఆవశ్యకతను వివరించి, హెల్మెట్లను పంపిణీ చేశారు.
బాల్యం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని అందించవచ్చని వారు స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *