గురుకులం లో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహణ

దర్శిలో అంబేద్కర్ గురుకులంలో బాలల వనమహోత్సవం,బాలల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 138వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గురుకులం ప్రిన్సిపల్ మీరాసాహెబ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిలు గా ప్రత్యేక అధికారి పూర్ణ చంద్, దర్శి ఎంఈఓ మాలకొండయ్య, మానవత సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.తర్వాత పర్యావరణ పరిరక్షణలో భాగంగా కిచెన్ గార్డెన్ లో విద్యార్థులు, గురుకులం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా,భారత దేశానికి నెహ్రూ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నెగ్గిన వారికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 510 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *