బేగంపేట నవంబర్ 27(జే ఎస్ డి ఎం న్యూస్ )
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. అస్సాం రాష్ట్రం, నార్త్ లఖింపూర్ జిల్లా బచగావ్ గ్రామానికి చెందిన జశుదా దాస్ (32) తన కుటుంబంతో కలిసి బేగంపేట ప్రకాశం నగర్లోని భగవంతపూర్లో నివాసముంటూ హౌస్ కీపింగ్ పనిచేస్తోంది.
ఆమె తల్లి అకినే దాస్ (70) గత మూడు నెలలుగా కూతురి వద్దే ఉంటోంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో కుటుంబసభ్యులందరూ నిద్రిస్తుండగా, అకినే దాస్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. నిద్రలేచాక తల్లి కనిపించకపోవడంతో జశుదా దాస్ పరిసర ప్రాంతాలు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితంలేకపోయింది. దీంతో తన తల్లి ఆచూకీ కనుగొనాలని కోరుతూ గురువారం (నవంబర్ 26) మధ్యాహ్నం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై సిహెచ్. శేఖర్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: