అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 72 స్టేషన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమృత భారత స్టేషన్స్ పథకాన్ని ప్రకటించింది.. ఈ పథకంతో దొనకొండ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు రానున్నాయి…వాటిలో ఉచిత 5జి వైఫై, స్టేషన్లో ఎస్కలేటర్ నిర్మాణం, రెండువైపులా అప్రోచ్ రోడ్స్, పార్కింగ్ ఏరియా, స్టాల్స్ నిర్మాణం, సమావేశ మందిరాలు, కొత్తగా వెయిటింగ్ హాల్స్, రైల్వే న్యూ ట్రాక్స్, క్లీనింగ్, దివ్యాంగుల కొరకు వీల్ చైర్స్, ప్లాట్ ఫామ్ పొడవు పెంపు, సరికొత్త లైటింగ్ వంటి ఎన్నో సదుపాయాలకు దొనకొండ రైల్వే స్టేషన్ కు రానున్నాయి.
దొనకొండ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు వస్తున్నాయోచ్
12
Feb