మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఎంఎన్ఆర్ఆస్ఈజీఎస్ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీలకు మంజూరు అయిన మెడికల్ కిట్స్ పంపిణీ చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కిట్స్ పంపిణి చేసారు. కార్యక్రమంలో సర్పంచిలు మల్కాపురం, బెల్లంకొండ వారిపాలెం సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీఓ మురళి, ఈసీ ప్రసాద్లు పాల్గొన్నారు.
కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలి – ఉపాధి హామీ కూలీల కిట్స్ పంపిణి
16
Feb