హరోం హర..

  • కన్నుల పండువగా నిర్మమహేశ్వరుని
  • పొదిలి వీధుల్లో ఊరేగిన గౌరీశంకరుడు • కులమతాలకు అతీతంగాతరలివచ్చిన ప్రజలు

హర హర మహాదేవ.. శంభో శం కర అంటూ పొదిలి మార్మోగింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పొదిలి పట్టణంలో వేంచేసిన పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం అంగరంగా వైభవం రమణీయంగా జరిగింది. వేలాది మంది భక్తులు వెంటరాగా స్వామి వారి ఉత్సవ మూర్తు లను రథంపై ఉంచి పొదిలి పురవీధుల్లో ఊరేగిం చాడు. స్వామి వారికి మూలంరాజు సుబ్బనర -సయ్య, దరిశి వెంకట సుధాకర్, దరిశి వెంకట రామ మూర్తిలు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. నారాయణం శ్రీనివాసాచార్యులు ప్రత్యేకం గా రథాన్ని అలంకరించారు. స్వామివారికి నీటితో వారు పోసి కుంభం పెట్టి పార్వేట బలి ఇవ్వడానికి సుమారు మధ్యాహ్నం 3 గంటలైంది. వేలాది మంది.. భక్తులు హరహర అంటూ శివనామస్మరణ చేస్తుండగా రథం కదిలింది.
*రథోత్సవానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు:*
రథోత్సవాన్ని తిలకించడానికి పొదిలి పరిసర గ్రామాల నుంచే గాక, జిల్లా నలుమూలలు నుంచి కులమతాలకు అతీతంగా భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో పొదిలి పట్టణ వీధులన్నీ భక్త జన సంద్రంగా మారాయి. రథం తిరిగే సమయంలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి రథం చక్రాల కింద గుమ్మడి కాయలు పెట్టి స్వామివారిని దర్శించుకున్నారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం శివాలయం నుంచి చినబస్టాండ్, అమ్మవారిశాల, పెద్దబస్టాండ్, రాఘవేంద్ర థియేటర్ సెంటరు, సాయిబాబాగుడి సెంటరు, దర్శి రోడ్డు సెంటరు మీదుగా శివాలయం చేరుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా రథోత్సవాన్ని భక్తులు తిలకించారు. రాఘవేంద్ర థియేటర్ సెంటరు నుంచి రథాన్ని మహిళలు లాగారు.
*రథోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు:*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రథోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతి నిధులను బాజాభజంత్రీలతో తీసుకురాగా ఆలయ పాలకమండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు. వారిని శాలువతో సన్మానించారు. ముందుగా శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని రథం లాగారు. రథోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెం కాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి, ఆలయ చైర్మన్ యక్కలి శేషగిరిరావు, తహశీ ల్దార్ భాగ్యలక్ష్మి, ఈఓ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, మర్రిపూడి, కొనకనమిట్ల ఎంపీపీలు వాకా వెంకట రెడ్డి, మోరబోయిన మురళి, పట్టణ, మండల పార్టీ. అధ్యక్షుడు నూర్జహాన్ బేగం, డీ శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, మాజీ కన్వీనర్లు జీశ్రీనివాసులు, గుజ్జుల సంజీవరెడ్డి, ఎఎంసీ మాజీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కే నరసింహరావు: తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *