చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. శివరామపురంలో సాగు చేస్తున్న చిరుధాన్యాలను సోమవారం పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేసారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ … 20203వ సంవత్సరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సాగును పెంచే దిశగా ప్రతి సోమవారం రైతు భరోసా కేంద్రాలలో ‘ మండే మిల్లెట్స్ డే ‘ గా తీర్మానించి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రబీ, వేసవిలలో సాగు చెయ్యవలసిన పంటలు జన్న, సజ్జ, రాగి, కొర్ర, అండ్రు కొర్ర, ఊద, సామ, ఆరిక పంటలను సాగు చెయ్యాలని చెప్పారు. ప్రతి ఖాళీ పొలంలో 2 కి.లోల విత్తనం చల్లినట్లయితే ముందు పండించిన పైరుకు పెట్టిన ఎరువు బలంతోనే పైరు పండుతుందని అన్నారు. రెండు తెలిక పాటి తడులు ఇస్తే ఆశించిన దిగుబడులు వస్తాయని చెప్పారు. విఏఏ రాజశేఖర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలకు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
27
Feb