దశదినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు నిడమానూరి వెంకటేశ్వర్లు దశదినకర్మకు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్సార్ సిపిపార్టీకి వెంకటేశ్వర్లు చేసిన సేవలు కొనియాడారు. ఆయన కుమారుడు నిడమానూరి చెంచయ్యను పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడవద్దని చెప్పి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల అధినేత నిడమానూరి నాగేశ్వరరావు, డైరెక్టర్ నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి, మండల వైసీపీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, నిడమానూరి రవి , మండల వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ జమ్ముల గురవయ్య, ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు చింత శ్రీనివాస్ రెడ్డి, గొంది వెంకట అప్పారెడ్డి, మండల వైసీపీ యువ నాయకులు మందలపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *