తూర్పు రాయలసీమ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల సచివాలయ జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి కోరారు. మండలంలోని బోద్ధి కూరపాడు, వెలుగు వారి పాలెం గ్రామాలలో మంగళవారం వైఎస్సార్సీపీ నాయకుల తో కలసి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థించారు. బోద్దికూరపాడులో మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి ఎంపిటిసి పాలకోటయ్య, హౌసింగ్ వేర్ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి వెలుగు వారి పాలెం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ నాయకుడు బ్రహ్మారెడ్డి , మాజీ సర్పంచ్ ఓబులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

