సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా అవకాశాలు కల్పించాలని, తద్వారా అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తారని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు. స్థానిక వైయస్సార్ క్రాంతి పథకం కార్యాలయంలో బుధవారం వైకెపి ఎపిఎం టీ హనుమంతరావు అధ్యక్షత నా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక ఆడపిల్లను చదివించాలని, 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయవద్దని సూచించారు. బాల్య వివాహాల పట్ల పలు అనర్ధాలు కలుగుతాయని ఈ విషయం తెలిసినప్పటికీ పలువురు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం పట్ల పూర్తి అవగాహన, భవిష్యత్తుపై ఒక అంచనాకు వచ్చిన తరువాతే వివాహం చేయాలని సూచించారు. అనంతరం ఎంపీపీ సునీతను పూలమాలలతో దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైకెపి సిబ్బంది మోహన్ రావు ,గురవయ్య, అకౌంటెంట్ జి మార్తమ్మ, సంఘాల మహిళలు పాల్గొన్నారు.
