తాళ్లూరు నడి వీధిలో దుండగులు భారీ చోరికి పాల్పడ్డాయి. కుటుంబసభ్యులు శింగర కొండ తిరునాళ్లకు వెళ్లిన సమయంలో నివాసంలో ఎవరూ లేరని నిర్ధారించుకుని ప్రతి గదిని సోదా చేసి మరీ దొరికిన కాడిన దోచుకువెళ్లారు. వివరాలలోనికి వెలితే… తాళ్లూరుకు చెందిన చందోలు శ్రీనివాసరావు రామాలయం ప్రక్కన స్వంత నివాసంలో ఉంటున్నారు. కిరాణ మర్చట్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా కుటుంబసభ్యులు తిరునాళ్లకు వెళ్లారు. యజమాని శ్రీనివాసరావు ముందుగా ఒంటి గంట సమయంలో వచ్చి తాళాలు లేక పోవటంతో ఎదురు ఇంటిలో నిద్రస్తూ కుటుంబసభ్యుల కోసం వేచి చూసాడు. 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులు వచ్చి మెట్ల వద్ద గేటు తాళం తీసి పైకి వెళ్లి ప్రధాన తలుపు తాళం తీయటానికి ప్రయత్నించగా తలుపు తెరుచుకోలేదు. లోన వైపు బోర్డు పెట్టినట్లు గట్టిగా రాక పోవటంతో వారి బంధువులకు సమాచారం ఇవ్వటంతో గ్రామంలోని వడ్రంగికి తెచ్చి తలుపు తీయటానికి ప్రయత్నం చేసారు. తలుపు తీయగానే నివాసంలో సెల్ఫ్ లు తెరచుకుని ఉండటం, బెడ్ రూం తదితర ప్రాంతాలలో వస్తువులు అన్ని చిందర వందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.దర్శి సీఐ రామకోటయ్య, క్లూస్ టీం ఎస్సై శరత్ కుమార్ లు క్షున్నంగా ప్రతి అంగుళం పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. రూ. 27 లక్షల విలువైన 66 సవర్ణ బంగారం, శ్రీనివాసరావు గదిలో రూ. 3లక్షలు, కుమారుడు మణి గదిలో రూ.1లక్ష కుమార్తె దాచుకున్న పాకెట్ నగదుతో సహా పూర్తిగా దోచుకెళ్లారు. అయితే నివాసంలో ఉన్న వెండిని మాత్రం వదిలివెళ్లారు.
కుమార్తె పెళ్లి కోసమని దాచుకున్న బంగారం, నగదు దుండగులు దోచుకెళ్లటంతో కుటుంబసభ్యులు బాధ వర్ణానాతీతం. బోరున విలపిస్తున్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీ శ్రీనివాసరావు, మాజీ ఎఎంసి చైర్మన్ ఐ. వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి సంఘట స్థలాన్ని పరిశీలింది బాధితునికి ధైర్యం చెప్పారు.
వరస దొంగతనాలతో బెంబేలు
వరుస భారీ దొంగతనాల నేపథ్యంలో ప్రజలు వంటిచేత్తుడు న్నారు. గత సంవత్సరు శింగరకొండ తిరునాళ్ల రోజునే తాళ్లూరులో తాటికొండ వెంకటేశ్వర్లు నివాసంలో దొంగతనం జరగటం, తర్వాత తూర్పు గంగవరంలో ఒక విలేకరి నివాసంలో దొంగతనం జరగటం, బ్రహ్మాంగారి గుడిలో కూడ చోరీ జరగటంతో పాటు నేటికి ఆ నేరాలకు సంబంధించి నిందితులను పట్టుకోక పోవటంతో దొంగతనాలు
పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు గట్టి చర్యలు
తీసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని కోరుకుంటున్నారు.



