చిన్నా.. పెద్ద అన్న తారతమ్యాలు మరిచి అందరూ సరదాగా ఆనందమే ఆకాశమై ఉత్సాహాన్ని నింపే మరో వసంతమే హోలీ పండుగను బుధవారం మండలంలోని పలు గ్రామాలలో యువతి యువకులు చిన్నారులు కలిసి రంగురంగుల నీళ్లతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సాహంగా గులాములు చల్లుకుంటూ కేరింత లు కొట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ పలు గ్రామాల్లో స్థిరపడిన రాజస్థానీ వాసులు హోలీని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులకు సెలవులు కావడంతో పిల్లలు బృందాలుగా బృందాలుగా ఏర్పడి వీధుల్లో పరుగులు తీస్తూ ఉత్సాహంతో ఉప్పొంగిపోతు ఆనంద డోలికల్లో మునిగితేలారు. మరి కొంతమంది స్వీట్లు పంపిణీ చేశారు
