ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చెంచు రెడ్డిపాలెం గ్రామంలో పి పి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిపిఎల్ కంపెనీ ప్రతినిధులు మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మహిళా రైతులను ఘనంగా సత్కరించారు. మహిళా రైతులకు బహుమతులను అందజేశారు. పిపిఎల్ కంపెనీ ఉత్పత్తులను వాటి ప్రాధాన్యత అవసరాలను మహిళ రైతులకు తెలియజేశారు. పీపుల్ కంపెనీ ఉత్పత్తుల ద్వారా పంట దిగుబడుని ఏ విధంగా పెంచుకోవచ్చో మహిళా రైతులకు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సందర్భంగా గ్రామంలోని ఆదర్శ మహిళా రైతులని పి .రమణమ్మ, పి పోలమ్మ, వై రెడ్డమ్మ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్, ప్రసాద్, జెకేఎస్ ప్రసాద్, డి బి టి ఎస్ వెంకట్రావు మరియు గ్రామంలోని మహిళా రైతుల పాల్గొన్నారు.


