వైఎస్సార్సీపీ బలపరచిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మాజీ సొసైటీ డైరెక్టర్ జి. వి శ్రీనివాస రెడ్డి కోరారు. జిల్లా చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బెల్లంకొండ వారి పాలెం పంచాయితీలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కులూరి అంజి రెడ్డి, అల్లూరి రెడ్డి, నారాయణ రెడ్డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
