యువత ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కలిగి జీవితాన్ని సరియైన మార్గంలో తీర్చిదిద్దికోవాలని ఎస్సై ప్రేమ్ కుమార్ అన్నారు. ఎబీసీ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీ నేర్చుకోవాలని అయితే బానిస కావద్దని కోరారు. మత్తు పదార్థాల దుష్పప్రభావాన్ని కుటుంబసభ్యులకు వివరించాలని కోరారు. గ్రామాలలో ఎవైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే తక్షణమే మహిళా పోలీస్, లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె. వేంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబు, మహిళా పోలీస్ భవాని పాల్గొన్నారు. అనంతరం యాంటీ డ్రగ్స్ కమిటిని ఏర్పాటు చేసారు.


