ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం – పోలింగ్ బూత్ లను పరిశీలించిన అధికారులు

13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని పోలింగ్ నిర్వహించేందుకు ముండ్లమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రులకు రెండు రూములు, ఉపాధ్యాయులకు ఒక రూము ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఎస్ ఉషారాణి ఆదివారం తెలిపారు. మొత్తం ఓట్లు1304 ఉన్నాయి. పట్టభద్రు లు1266 ఓట్లు ఉపాధ్యాయులు 38 ఓట్లు ఉన్నాయి. మూడు పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు.55 వ పోలింగ్ బూత్ లో మొత్తం656 ఓట్లు కాగా పురుషులు494 మహిళలు162 ఓట్లు,55 ఏ పోలింగ్ బూతు లో610 ఓట్లు కాగా పురుషులు466 ఓట్లు, మహిళలు144 ఓట్లు,31వ పోలింగ్ బూత్ లో 38 ఓట్లు కాగా పురుషుల టీచర్లు 29 మహిళా టీచర్లు తొమ్మిది ఓట్లు ఉన్నాయి. ఓటర్లు ఒత్తిడి లేకుండా వరుస క్రమంలో పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా భారీకేడ్లునుఏర్పాటు చేశామని, ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల ప్రాంతంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నామని ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *