ప్రజాభిమానం పొందడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భా వమై 12 ఏళ్లు నిండి 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… 13 ఏళ్ళలో వైఎస్సార్ సీపీ తిరు గులేని పార్టీగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేశారన్నారు. ఆనాటి రాజన్న పాలన అందిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అంతకు మించి సుపరి పాలన అం దిస్తూ ప్రజాభిమానం సంపాదించారని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 98 శాతం హామీలు అమలు పరిచిన ఒకే ఒక్క సీఎం గా భారత దేశంలో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ , దర్శి, ముండ్లమూరు ఎంపీపీలు సుధా అచ్చయ్య, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి , వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు దారం వాసుదేవరెడ్డి, , నారపురెడ్డి, కరుణా నిధి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

