పంటల దిగుబడి వ్యవయాన్ని విశ్లేషణ చేసుకుని లాభదాయకమైన పంటల సాగుకు రైతులు సమాయత్తం కావాలని జిల్లా వనరుల కేంద్రం టెక్నికల్ ఎవో శైలజా రాణి కోరారు. క్షేత్రీయ పర్యటనలో భాగంగా బుధవారం బెల్లంకొండ వారి పాలెం, దోసకాయలపాడులలో వ్యవసాయాధికారి ప్రసాదరావుతో కలసి పర్యటించి రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి ఇప్పటికే చేతికి వచ్చిన పంటల వివరాలు అడిగి తెలసుకున్నారు. సాగు ఖర్చులు పోను దిగుబడి వ్యయాలను లెక్కించుకుని లాభదాయంగా ఉండే పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వివరించారు. నువ్వులు, మొక్కజొన్న, మిరప పంటలను సందర్శించి సంరక్షణ చర్యలను సూచించారు. ఆర్బికేలో రైతులతో సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేసారు. సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.
