శివరామపురం మాజీ సర్పంచి నిశంకం సుబ్బులు గ్రామాభివృద్ధిలో, పార్టీ అభ్యున్నతిలో ఆమె పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే కరణం బలరామక్రిష్ణమూర్తి, వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు.
శివరామపురంలో శనివారం ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఆమె చిత్ర పటాకి ఎమ్మెల్యే బలరామక్రిష్ణమూర్తి, వైఎస్సార్సీసీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్ది రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎస్పీ నాగార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఐ. వేణుగోపాల్ రెడ్డి, కోఆప్షన్ మెంబెర్ కరిముల్లా, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కార్యదర్శి యలమందా రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు దేవదానం, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఆమె కుమారుడు వైస్సార్సీపీ నాయకుడు హనుమంతరావు, భర్త వెంకటేశ్వర్లును పరామర్శించారు.
