క్యాన్సర్ పై అవగాహన సదస్సు

తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం క్యాన్సర్పై అవగాహన సదస్సు పీహెచ్సీ వైద్యాధికారి బంకా రత్నం ఆధ్యక్షతన సభను నిర్వహించారు. హెచ్సీ, ఎం. ఎన్. ఆర్ క్యాన్సర్ సెంటర్ అంకాలజిస్ట్ డాక్టర్ రమణా రెడ్డి మాట్లాడుతూ స్త్రీలలో, పురుషులలో క్యాన్సర్ వచ్చే పరిస్థితులను, కారకాలను వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పొగాకు వినియోగించ పోవటం, రెగ్యులర్ ఎక్సర్ సైజలు, బయట ఆహారానికి దూరంగా ఉన్నట్లయితే క్యాన్సర్కు దూరంగా ఉండవచ్చని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ మస్తానమ్మ, హెచ్మీ సుశీల, ఎం.ఎల్. హెచ్. పిలు, పిఆర్డీఓ వెంకటరావు, ఆరోగ్య, ఆశ, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *