ఓ రామా.. రఘు రామా .. రమణీయం రాముల వారి కళ్యాణం

శ్రీరామ నవమి వేడుకలు మండలంలో గురువారం పలు గ్రామాలలో వాడ వాడలా నిర్వహించారు. చలువ పందిళ్ల వేసారు. ‘ తెలుగువారికి ఆదర్శదేవుడు అయిన రాముని కళ్యాణంను తూర్పు గంగవరం కొదండరామరామస్వామి దేవాలయం, తాళ్లూరు, సుంకిరెడ్డి పాలెం, బొద్దికూరపాడు, విఠలాపురం, కొత్తపాలెం, నాగంబొట్లపాలెం, లక్కవరం, బొద్దికూరపాడు, దారంవారిపాలెం, తురకపాలెం, శివరామపురం, రజానగరం. కొర్రపాటివారిపాలెం, రమణాలవారిపాలెం, మన్నేపల్లి, దోసకాయలపాడు, తోటవెంగన్నపాలెం, వెలుగువారిపాలెం తదితర గ్రామాలలో దేవాలయాల వద్ద ఉభయ దాతలు ప్రత్యేకపూజలు చేసి పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంచి పెట్టారు. భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గోన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పలు గ్రామాలలో సర్పంచిలు, ఎంపీటీసీలు, ఆలయ చైర్మన్లు స్థానిక నాయకులు ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *