ఓటర్ల జాబితా సవరణలో కచ్చితత్వం అత్యంత కీలకము – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

ఓటర్ల జాబితా సవరణలో కచ్చితత్వం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. బి.ఎల్.ఓ.లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నందున శుక్రవారం ఆయన ఒంగోలు సుజాత నగర్ లో ఈ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ …. ఈ ప్రాంతంలోని 93వ నెంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో 576 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జాబితాలో చేర్పులు, తొలగింపులకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధానాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది పాటిస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడానికే తాను ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. సిబ్బందికి ఈ విషయాలపై ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల జాబితా తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 90-100 పోలింగ్ కేంద్రాల సూపర్ వైజర్ కె. శ్రీనివాసరావును కలెక్టర్ సస్పెండ్ చేశారు.
కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, తహిశీల్దార్ మురళి, తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *