దేశ ప్రజలలో జాతీయతా భావాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు గాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తపాలా శాఖ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా తయారైన 30×20″ సైజు కల జాతీయ జెండాలను ఆంధ్రప్రదేశ్ లో ఏ పోస్ట్ ఆఫీసు నుంచైనా కేవలం Rs.25/- నామమాత్రపు చెల్లింపు తో పొందవచ్చు. ఈ సౌకర్యం గ్రామాలలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో కూడా కల్పించబడింది. పెద్ద మొత్తంలో జాతీయ జెండాలను కొనుగోలు చేయదలిచినవారు బి వి ఎన్ సురేష్, తపాలా సూపరింటెండెంట్, ప్రకాశం డివిజన్, ఒంగోలు-523001 7989356678, Email : doprakasa.ap@indiapost.gov.in) వారిని కానీ లేదా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వారిని సంప్రదించవచ్చు. ఈ సేవలను ఉపయోగించుకొని రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జాతీయత స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున జరుపుకోవలసిందిగా ప్రకాశం డివిజన్ ప్రజలకు ప్రకాశం జిల్లా తపాలా శాఖ సూపర్ ఇండెంట్ సురేష్ కోరారు.
