జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు
చెల్లించుకున్నారు. పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ఎనిమిది చీరలు బహుకరించారు. ఆలయానికి భక్తుల సందర్శన వలన రూ.9244 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎ శ్రీనివాసరావు తెలిపారు. సౌకర్యాలను ఈఓ ఎబి భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
సొసైటీ చైర్మన్ యాడిక యలమందారెడ్డి ప్రత్యేక పూజలు
నాగంబొట్లపాలెం సొసైటీ ఛైర్మన్ యాడిక యలమందా రెడ్డి దంపతులు అమ్మవారికి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఆలయ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఆర్ఎ శ్రీనివాసరావులు వారిని ఘనంగా సన్మానించారు.
