వెలుగు వారి పాలెం యు పి పాఠశాల విద్యార్థులకు పలువురు దాతలు చేయూత అందించారు.
ఎంపీ యూపీ వెలుగు వారి పాలెం పాఠశాల నందు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
కార్యక్రమంలో టీ పి రెడ్డి ఎన్నారై, తల్లపురెడ్డి ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ రెడ్డి విద్యార్థులందరికీ ఐడెంటిటీ కార్డులు మరియు రెండు రాక్స్ బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరాలను తమ ఫౌండేషన్ తరపునసమకూరుస్తామన్నారు.గ్రామ సర్పంచ్ ఎం కోటేశ్వరమ్మ పాఠశాలకు బీరువా డొనేట్ చేయడం జరిగింది. ఎం దుర్గ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు ఎం వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శ్రీనివాసరావు , విద్యా కమిటీ చైర్మన్ ఐ రమణారెడ్డి , గ్రామ పెద్దలు ఎం బ్రహ్మారెడ్డి గారు, ఎం ఓబుల్ రెడ్డి గారు, డీలర్ వెంకట రెడ్డి గారు, పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీ గారు, డీలర్ వెంకట రెడ్డి గారు గ్రామ పెద్దలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కే కృష్ణకుమారి , ఆర్ నాగ సురేష్, డి ఉమా బాల, పి గోవిందమ్మ, ఎస్ కే చాంద్ బాషా, ఎం వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

