ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 2022-20 23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం రోజున మంగళవారం ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం ఆ పాఠశాల చైర్మన్ ఎడమకంటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు ప్రఖ్యాత లు తీసుకురావాలని కోరారు. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు మాట్లాడుతూ …దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఆధారపడి ఉందని, విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం పదవ తరగతిలో 578 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన వలేటి దీక్షిత కు రూ. 3348 రూపాయల నగదు, ద్వితీయ స్థానంలో 550 మార్కులు సాధించిన ఎడమ కంటి ధనలక్ష్మికి రూ.1548 రూపాయల నగదు. తృతీయ స్థానం లో 546 మార్కులు సాధించిన అద్దంకి ఉమామహేశ్వర కి రూ.1548 రూపాయల నగదు అందించారు . ప్రోత్సాహక నగదును కారుమంచి నరసింహారావు, శిఖకొల్లి సుభాషిని. కే వీరాచారి అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మాధవి లత, ఉపాధ్యాయులు హజరత్ అలీ, భావన్నారాయణ, శివరామ కోటేశ్వరరావు, ప్రభాకర్ ,ఏడుకొండలు, శ్రీదేవి ,విజయనిర్మల, భారతి, చక్రపాణి, సుభాషిని, సత్యనారాయణ, శ్రీనివాసరావు, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.
