బాలికలపై జరిగే లైంగిక దాడులు అరికట్టాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని దర్శి సీనియర్ సివిల్ జడ్జ్ జీఎల్వీ ప్రసాద్ పేర్కొన్నారు. దర్శి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం గుడ్ టచ్, బ్యాడ్ టర్పై అవగాహన కార్యక్రమం జరిగింది. న్యాయమూర్తి జి ఎల్ వి ప్రసాద్ మాట్లాడుతూ… మారుతున్న సమాజంలో మహిళల మనుగడ కష్టమయ్యిందన్నారు. అప రిచితులు, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారికి దూరంగా ఉండాలన్నారు. ఏ స్పర్శ అయితే అసౌకర్యంగా ఉంటుందో అది బ్యాడ్ టచ్ అని, అది చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తల్లిదండ్రులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విదార్థినులను పలు ప్రశ్నలు అడిగి సరైన సమాధానం ఇచ్చిన వారికి బహుమతులు అంద జేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు చెన్నకేశవులు, మంజుల, రాజ్యలక్ష్మి, హెచ్ఎం ఖాదర్ మస్తాన్ , ఉపాధ్యాయులు ,విద్యార్థినులు పాల్గొన్నారు.


