గుంటి గంగమ్మతల్లికి తురకపాలెం టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పొంగళ్లుపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటాగంగమ్మ తల్లి తిరునాళ్లకు ప్రభనుకట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది ప్రభను కట్టక పోవటంతో అమ్మ వారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండగా ఆదివారం తురకపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలోలో టీడీపీ శ్రేణులుట్రాక్టర్లు,ద్విచక్రవాహనాల్లో గ్రామంనుండి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మహిళలు పొంగళ్లు పెట్టి గంగమ్మతల్లి చుట్టూ ప్రదక్షణలు చేశారు. డప్పువాయిద్యాలతో ముందుకు సాగారు. పొంగళ్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు జరిపి, గంగమ్మతల్లి చల్లంగా చూడాలని, వర్షాలు సక్ర మంగా కురిసి పంటలు బాగాపండాలని మొక్కుకున్నారు. గంగమ్మ పొంగళ్లకు అధికసంఖ్యలో ప్రజలు తరలి రావటంతో గుంటి గంగ ప్రాంగణం తిరునాళ్లను తల పించే విధంగా కోలాహలంగా వుంది. భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండలటీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి,కుమ్మిత సుబ్బారెడ్డి, సర్పంచ్ చంద్రగిరి గుర్వారెడ్డి, వై.లింగారెడ్డి, అంబట్టి వీరనాగిరెడ్డి, సిహెచ్ వె కటరెడ్డి, కె.కృష్ణారెడ్డి, ఎ.సుబ్బారెడ్డి, సిహెచ్ తిరుపతిరెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీశ్రేణులు పాల్గొన్నారు.

