ఘనంగా ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం – వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో బీసీలకు మైనార్టీలకు ప్రాధాన్యం – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరు కాగా ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా షేక్ షకీలా, వైస్ చైర్మన్ గా కండెగంగయ్య, మెంబర్లుగా భవనం మురళీకృష్ణారెడ్డి, చెన్నంశెట్టి శ్రీనివాసరావు, అబ్బ నరసమ్మ, అడ్డగిరి వెంకటనారాయణ, అడుసుమల్లి రాజ్యం, శాగం రోశమ్మ, లవనూరి సుబ్బులు, షేక్ రసూల్ భాష, దాసరి ఏలియా, ముక్తిపూడి జెమీమా, దేవరకొండ వెంకటేశ్వర్లు, గంజి వెంకటే శ్వరరెడ్డి, షేక్ నసీమాలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో దర్శి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహక రించారని చెప్పారు. దర్శి – కురిచేడు రోడ్డు, డిగ్రీ కళాశాల, అర్బన్ క్లీనిక్, అగ్రీ ల్యాబ్, గోడౌన్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రతి మం డలంలో చిన్న చిన్న గ్రామాల్లో వారికి కూడా పదవుల్లో అవకాశాలు ఇచ్చామని చెప్పారు. రూ.121 కోట్లతో తాగునీటికి టెండర్లు కూడా వేశామని, అందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్ర మంలో తాళ్లూరు మండల ఇన్చార్జి రవీం ద్ర, ఎంపీపీలు సుధాఅచ్చయ్య, తాటికొండ శ్రీనివాసరావు, బెల్లం కోటేశ్వరమ్మ, సుంకర సునీతా బ్రహ్మనం దరెడ్డి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జెడ్పీటీసీలు మారం వెంకారెడ్డి, సుధాకర్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ విమల రామకృష్ణ, జేసీఎస్ కన్వీనర్లు ఎదురు కోటి రెడ్డి, యాడిక శ్రీనివాసరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి,
వైస్ ఎంపీపీలు ప్రియాంక నాగార్జునరెడ్డి, కొరివి ముసలయ్య, కౌన్సిలర్లు బాబూరావు, మోహన్ బాబు, జిల్లా ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *