గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వేలో తేడాలుంటే సరిచేయాలని డిఎల్ఎస్ఓ కిషోర్ బాబు అన్నారు. ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పార్సెల్ నంబర్ల వారిగా( ఎల్ పి ఎన్) సర్వే నెంబర్లు వేసి గట్లు వద్ద హద్దురాలు ఏర్పాటు చేయాలన్నారు. భూముల వివరాలలో తప్పులుంటే భూములు యజమానులను పిలిపించి వారి సమక్షంలో సరి చేయాలన్నారు. ఫీల్డ్ మ్యాప్ తయారుచేసి రికార్డులు పూర్తి చేయాలన్నారు. రీ సర్వేలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఐ సుబ్బారాయుడు, డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ ఏ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ పి శేషగిరిరావు, వీఆర్వోలు ,విలేజ్ సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.
