ప్రతి కుటుంబానికి ఉచిత ఆరోగ్య పరీక్షలు -వైద్యాధికారి బి మధు శంకర్

ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఉమామహేశ్వరపురం గ్రామంలో సచివాలయంలో మంగళవారం వైయస్సార్ కుటుంబ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాల్లో నీ ప్రజలకు మీ గ్రామాల్లో గల డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల వద్ద కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లోని అన్ని సచివాలయాలలో హెచ్ డబ్ల్యు సి హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయని, వీటిలో బీఎస్సీ నర్సింగ్ చదివిన అధిక విద్యావంతులైన సిహెచ్ ఓలను ప్రభుత్వం నియమించి గ్రామాలలో బీపీ, షుగర్, దీర్ఘకాలిక రోగులకు ఉచిత సేవలు అందిస్తారనితెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, ఏఎన్ఎం సుధారాణి, ఎం ఎల్ హెచ్ పి జయశ్రీ, ఎం వెంకట ప్రసాద్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *