ప్రకాశం జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతాంగమునకు ప్రత్యామ్నాయఖరీఫ్ పంటల ప్రణాళిక తయారు చేసుకోవాలి – వరి సాగుకు నీటి లభ్యత పై సాగు నీటి శాఖ స్పష్టత

ప్రకాశం జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతాంగమునకు ప్రత్యామ్నాయ
ఖరీఫ్ పంటల ప్రణాళిక తయారు చేసుకోవాలిని ప్రకాశం జిల్లా ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ లక్ష్మి రెడ్డి కోరారు. నీటి లభ్యత వివరాలు వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ క్రింద 5 నియోజక వర్గములలోని 14 మండలములలో 1,03,567 ఎకరముల మాగాణి మరియు 1,50,825 ఎకరముల మెట్ట మొత్తం 2,54,392 ఎకరముల రిజిస్టర్డ్ ఆయకట్టు ఉన్నది, మరియు 98 గ్రామీణ త్రాగునీటి చెరువులు, 5 పట్టణ SS ట్యాంక్స్ నకు మంచినీటి సరఫరా చేయబడుచున్నది.
2023-24 నీటి సంవత్సరమునకుగాను ఇప్పటి వరకు నాగార్జున సాగర్ జలాశయమునకు ఎటువంటి వరదనీటి ప్రవాహము మొదలై వుండలేదు. తేదీ: 30.08.2023 నాటికి నాగార్జున సాగర్ నందు కేవలము 153.50 TMC ల నీరు మాత్రమే (పూర్తి నిల్వ సామర్ధ్యము: 312.05 TMC, డెడ్ స్టోరేజ్ 131.67 TMC) మాత్రమే అందుబాటులో ఉన్నవి. తేదీ: 21.08.2023న జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశము నందు సాగర్ జలాశయము నుండి త్రాగు నీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కమిటీ కన్వీనరు వారు సూచించడము జరిగినది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సాధారణముగా సాగర్ జలాశయము పూర్తిగా నిండి వరద ప్రవాహము ఉన్న సమయములలో సెప్టెంబరు మాసము నందు ప్రకాశం జిల్లాకు ఖరీఫ్ పంట కొరకు సాగు నీరు విడుదల చేయడము జరుగుతుంది.
సాగర్ జలాశయమునందు నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నందున, ప్రకాశం జిల్లాకు 2023-24 లేట్ ఖరీఫ్ సీజనుకు సాగు నీటి సరఫరా ఉండే పరిస్థితులు లేవని తెలియజేయడమైనది. నీటి సరఫరా కేవలము త్రాగు నీటి అవసరముల నిమిత్తము మాత్రమే ఉండునని తెలియజేయడమైనది.
ఇందు నిమిత్తమై సాగర్ కుడి కాలువ ఆయకట్టు కొరకు ప్రత్యామ్నాయ ఖరీఫ్ పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ, ప్రకాశం జిల్లా వారు రూపొందించడము జరిగినది. ఇందులో భాగముగా వరికి ప్రత్యామ్నాయముగా సాగు చేసుకొనుటకు అనువైన వర్షాధార పంటల వివరములను మరియు రకాలను వ్యవసాయ శాఖ వారు చ జరిగినది.
ఇందుమూలముగా, వ్యవసాయ శాఖ వారు సూచించిన వర్షాధార పంటలను ఈ ఖరీఫ్ (లేట్) సీజను నందు సాగు చేసుకొనవలసినదిగా ప్రకాశం జిల్లా సాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతాంగమునకు విజ్ఞప్తి చేశారు.
తదుపరి నీటి విడుదల కేవలము త్రాగు నీటి అవసరములకు మాత్రమే ఉండవచ్చునని తెలియజేయడమైనది. త్రాగు నీటి కోసము విడుదలచేయబడిన నీటిని ఎట్టిపరిస్థితులలో వ్యవసాయ అవసరములకు వినియోగించవద్దని కేవలము వ్యవసాయ శాఖ వారు సూచించిన వర్షాధార పంటల సాగును చేపట్టి అధికారులకు సహకరించవలసినదిగా నాగార్జునసాగర్ కుడి కాలువక్రింద ఉన్న ఆయకట్టు రైతాంగమును కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *