ప్రస్తుత వర్షాభావ పరిస్ధితులలో, వేసిన వంటలను బెట్ట పరిస్థితుల నుండి కాపాడుకోవాలని, మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు.
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నీటి వసతి లేని, బోర్లు సరిగా లేని రైతులు, వేసిన కంది, కొర్ర, ప్రత్తి తో పాటు వివిధ పంటలలో యాజమాన్య పద్ధతులు చేపట్టాలని తెలిపారు.
ఎకరాకు యారియా 4 కిలోలు లేదా డి.ఎ.పి 4కిలోలు లేదా 13-0-45 2కిలోలు, 200లీటర్లు నీటిలో కలుపుకొని, పంటపై పిచికారీ చేయాలని, మరియు అంతర సేద్యం చేయుట ద్వారా పంటల ను సంరక్షించుకోవచ్చని ఎ.వి. తెలిపారు.
ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ కాల పరిమితి గల కంది, కొర్రలు, ఉలవలు, అలసందలు, సోయా చిక్కుడు, జొన్న, సజ్జ, రాగి, ఆరిక, సామ, ఊద, వరిగ మొదలగు పంటలను వేసుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో ఎ.ఇ.ఓ నాగరాజు నాయక్, అశోక్, రైతులు పాల్గొన్నారు.
