తాళ్లూరు మండలంలో వైఎస్సార్ వర్థంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులో వెల్లంపల్లి రోడ్లో వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన వేడుకలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మా రెడ్డి, మాజీ సర్పంచి జక్రయ్య, వైఎస్సార్సీపీ నాయకులు జయరామి రెడ్డి, యలమందా రావు, జెసీఎస్ కెవీ పాలెం కన్వినర్ విష్ణు తదితరులు పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. మిగిలిన వైఎస్సార్ విగ్రహాలు ఉన్న అన్ని గ్రామాలలో వైఎస్సార్ విగ్రహాలకు అభిమానులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు.






