డాక్టర్ వైయస్సార్ స్ఫూర్తిదాత – దివంగత సీఎం వైయస్సార్ కు ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు – జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, అదే ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడలనే స్పూర్తిగా తీసుకుని ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తు న్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు. శనివారం వైఎస్సార్ వర్ధంతిని పుర స్కరించుకుని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యక ర్తలు, అభిమానులతో కలిసి చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మంపడం వద్ద, దివంగత సీఎం వైయస్సార్ , దివంగత ఎమ్మెల్యే బిఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . అనంతరం పోలీస్ స్టేషన్, ఎన్ఎస్పీ కాలనీ, గాంధీనగర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ పాలనలో ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ చల్లా అం కులు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీ టీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మండల రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీ నర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *