అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలో పలు పంచాయితీలలో నూతనంగా మంజూరు అయిన వైఎస్సార్ పెన్షన్ కానుక ను అందించారు. తాళ్లూరులో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, వైస్ ఎంపీపీ ఎం ఎన్ పి నాగార్జున రెడ్డిలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అభ్యున్నతికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయా కార్యక్రమాలలో స్థానికనాయకులు,గ్రామకార్యదర్శులు పాల్గొన్నారు.



