రాబోయే సాధారణ ఎన్ని కల్లో వినియోగించేందుకు బెంగళూరులోని బెల్ కంపెనీ నుంచి జిల్లాకు కొత్తగా కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని డీఆర్డీ శ్రీలత తెలిపారు. ఆ మేరకు శనివారం స్థానిక మామిడిపాలెం ఈవీఎం గోదాములో వాటిని భద్రపరిచారు. ప్రత్యేక వాహనంలో 5,440 కంట్రోలు యూనిట్లు, 1,250 బ్యాలెట్ యూనిట్లు బెంగళూరు నుంచి వచ్చాయి. వీటిని ఎన్నికల విభాగం అధికారి శ్రీనివాసరావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాహనాల నుం చి దింపి గోదాములో భద్రపరిచారు. ఇప్పటికే జూలైలో 6,630 వీవీప్యాట్లు జిల్లాకు వచ్చిన సంగతి తెలిసిందే. డీఆర్వో వెంట వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు కాలేషాబేగ్, గుర్రం సత్యం, పోలీసు సిబ్బంది ఉన్నారు
