ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో ఎస్సీ, బీసీ కాలనీ, మెయిన్ సిమెంటు రోడ్డు వద్ద డ్రైనేజీ కాలువ పై సిమెంటు పైపు లేక కాలనీవాసులు విద్యార్థులు వ్యవసాయ రైతులు నిత్యం నడక సాగించే సమయాలలో మురికి కాలువలో దిగలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు కుమ్మిత పేరారెడ్డి తన మానవత్వం చాటుకొని సొంత నిధులు రూ. 7,000 వేల రూపాయలతో వెచ్చించి డ్రైనేజీ కాలువపై సిమెంట్ పైపు ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల మట్టి తోలించి ప్రజలకు డ్రైనేజీ బాధ తప్పిచారు. దీంతో పేరారెడ్డి కి ఎస్సీ కాలనీవాసులు బీసీ కాలనీవాసులు విద్యార్థులు అభినందనలు తెలిపారు
