సంపూర్ణ పోషణకు చిరు ధాన్యాలు ఎంతో ప్రయోజనకరమని, పెరిగే పిల్లలకు పోషకా హార లోపం లేకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని వ్యవ సాయాధికారి బి. ప్రసాదరావు తెలియజేశారు. తాళ్లూరు మండలంలోని లక్కవరంలో మంగళవారం పోషకాహార మాసోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావే శంలో మాట్లాడారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకా లను పిల్లలకు అందించాలని సూచించారు. వీఏఏ వీరాంజనే యులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
