గ్రామాల్లో చేపడుతున్న జగనన్న భూరక్ష భూ హక్కు కార్యక్రమాలలో భాగంగా రీ సర్వేను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ ఏ స్రవంతి అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే చేసే గ్రామాలలో ముందుగా రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వద్ద ఉన్న పత్రాలు ఆధారంగా సర్వేకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇరువురి మధ్య ఏదైనా సమస్య తలెత్తితే కార్యాలయంలో భూమి రికార్డులు పరిశీలించుకోవాలన్నారు. సర్వే అనంతరం ఎఫ్ పి ఓ ఎల్ ఆర్ ప్రకారం భూమి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ గ్రామాల్లో అసైన్డ్ భూములను గుర్తించి ఎవరెవరి ఆధీనంలో సాగులో ఉన్నాయో గుర్తించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టి ఓట్లు చేర్పులు, తొలగింపులు, చనిపోయిన వారి ఓట్లు గుర్తించి సర్వే నిష్పక్షపాతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు పాల్గొన్నారు.
