సామాన్యునికి న్యాయం జరుగుతుందని భరోసా లభించిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. సోమవారం రాత్రి ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన చం ద్రబాబును రిమాండ్ కు పంపడం ద్వారా సామాన్యునికి న్యాయం జరుగుతుందన్న భరోసాను తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పెద్ద పెద్ద లాయర్లను తెప్పించిన చంద్రబాబు తప్పులు చేయబట్టే జైలుకు వెళ్లారన్నారు. ప్రజాధనాన్ని దోచుకుం టే ప్రభుత్వం ఉపేక్షించదని, ఈ కేసులో చంద్రబాబుకు రిమాండే కాదని, శిక్ష కూడా పడుతుందని చెప్పారు

