ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రెడ్డి సాగర్ గ్రామ శివారులో కోళ్ల పందెం
స్థావరం పై ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. కోడి పందేం అడుతున్న ముగ్గురు వ్యక్తులను, వారి వద్ద నుండి నాలుగు పందేం కోళ్లను రూ. 3230 నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎక్కడైనా సరే జూదం, కోడి పెందేలు ఆడుతున్నట్లు తెలిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
