పేదలకు వరం వైఎస్సార్ పెన్షన్ అని వక్తలు అన్నారు. బొద్దికూరపాడులో సర్పంచి
మందా శ్యామ్సన్ అధ్యక్షతన బుధవారం సభను నిర్వహించి నూతనంగా మంజూరు
అయిన 46 పెన్షన్లు పంపిణీ చేసారు. ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ
బాల కోటయ్య, పీఎంసీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి, సంగన యోగి రెడ్డి, సచివాలయ సిబ్బంది
పాల్గోన్నారు.


