ఘనంగా జాతీయ హిందీ దినోత్సవం

మండల కేంద్రమైన ముండ్లమూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 74 వ జాతీయ హిందీ దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందీ మన జాతీయ భాషని, అది దేవనా గరి లిపిలో ఉందని, హిందీ జాతీయ భాష వలనదేశంలో ఐక్యత ఏర్పడుతుందని అన్నారు. తొలత పార్లమెంట్లో 1947 సెప్టెంబర్ లో హిందీ జాతీయ భాషగా ఆమోదింప జే శారని, అనంతరం 1949 సెప్టెంబర్ 14 నుండి జాతీయ భాషగా గుర్తించి అమలు చేయడం ప్రారంభించారని, మన జాతీయ భాషగా గుర్తించబడి ఇప్పటి కి 74 సంవత్సరాలు గడిచింది అన్నారు. హిందీ పండిట్ కె ఎస్ ఆర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ హిందీ భాషా ఔన్నత్యాన్ని గురించి వివరించారు. దేశ సమైక్యతను కాపాడేది హిందీ అని అన్నారు. హిందీ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. హిందీ భాష వలన దేశ దేశాలు తిరగవచ్చన్నారు. ప్రపంచంలో హిందీ భాష నాలుగో స్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, ఎస్.కె హజరత్ అలీ, ఆంజనేయులు ,ప్రభాకర్, శివరామ కోటేశ్వరరావు, చక్రపాణి, భావన్నారాయణ, ప్రభావతి, సుభాషిని ,భారతి, శ్రీదేవి, ప్రణతి, ఏడుకొండలు, శ్రీనివాసరావు, అద్దంకి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *