బిజేపి పార్టీ పిలుపు మేరకు దర్శి పట్టణంలో గురువారం అజాదీకా అమృత మహోత్సవ్‌లో బాగంగా ఇంటింటికి తిరిగి మట్టి, బియ్యం సేకరించారు. బిజేపి అసెంబ్లీ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ … దేశంలో ప్రతి నివాసం నుండి సేకరించిన చిటికేడు మట్టిని, బియ్యాన్ని రాజధాని ఢిల్లీ కి చేర్చి అమృత వనం పేరుపై మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీసీ నాయకులు అనిల్, కుమార్, శివ కోటాచారిలు పాల్గొన్నారు.
