ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తో పాటు పలు పాఠశాలలను తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ శుక్రవారం పరిశీలించారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ ను ఆయన పరిశీలించారు. రేసలైజేషన్ లో భాగంగా పోలింగ్ బూత్ ను ఆయన పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ ను పబ్లిక్ చేయుటకు మార్పులు చేర్పులు లేకుండా కోడ్ ప్రకారం అక్కడ ఉండే విధంగా మార్గదర్శకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, పాఠశాల హెచ్ఎం ఎల్ మాధవి లత, ఉపాధ్యాయులు ఎస్ కే హజరత్ అలీ, ఏడుకొండలు, ఆంజనేయులు, జి దేవకాంత్ తదితరులు పాల్గొన్నారు.
