వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటులో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ యు .వి కృష్ణయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్న విగ్రహాలైన, పెద్ద విగ్రహాలైన, ప్రతి విగ్రహానికి తప్పనిసరిగా పోలీసు అనుమతికి తీసుకోవాలన్నారు. కరెంటు కనెక్షన్ కావాలంటే అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని, ప్రధాన రహదారుల మధ్యలో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ఆయన తెలిపారు. అలాగే విగ్రహాల కమిటీ వారి పేర్లు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు విగ్రహాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత వహించాలని, బాణాసంచా కాల్చకూడదని, అలాగే మైకులు ఎక్కువగా సౌండ్ పెట్టకూడదని, మద్యం సేవించి విగ్రహాల పరిసర ప్రాంతాలలో సంచరించ కూడదన్నారు. పోలీసు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యు .వి. కృష్ణయ్య తెలిపారు.
